Hyderabad: డివైడర్ను ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు మృతి
ABN , First Publish Date - 2022-10-10T15:48:21+05:30 IST
ఎల్బీనగర్(LB NAGAR) రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. హస్తినాపురంలో(Hastinapuram) అదుపు
Hyderabad: ఎల్బీనగర్(LB NAGAR) రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. హస్తినాపురంలో(Hastinapuram) అదుపు తప్పిన బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హరీశ్వర చారి(21), మధు (21)గా పోలీసులు గుర్తించారు.