ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫొటోగ్రఫీ
ABN , First Publish Date - 2021-06-30T00:06:25+05:30 IST
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తారు. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా..? సరదాగానే.. కాసేపు ఆటవిడుపుగా
హైదరాబాద్: ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తారు. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా..? సరదాగానే.. కాసేపు ఆటవిడుపుగా అలా ఫొటోగ్రాఫర్‌లా మారారు. వివరాల్లోకి వెళితే... తన కార్యాలయానికి వచ్చిన ఓ వ్యక్తిని మొబైల్‌లో ఫొటో తీస్తూ కెమేరా కంటికి చిక్కారు. తీరికలేని ప్రజాకార్యక్రమాలతో బిజీగా ఉండే ఆయనలో హాస్యం పాలు కూడా ఎక్కువే. కార్యకర్తల్లో, అలాగే తనను కలవడానికి వచ్చిన వారిలో ఉత్సాహం నింపుతూ.. సరికొత్త ఉత్సాహాన్నిస్తుంటారని సన్నిహితులు అంటుంటారు. ప్రస్తుతం ఈ ఫొటో స్థానిక వాట్సాప్ గ్రూపులలో హల్ చల్ చేస్తోంది.