జాతీయ అథ్లెటిక్స్‌ షురూ

ABN , First Publish Date - 2021-09-16T08:24:19+05:30 IST

హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప బుధవారం ఘనంగా ప్రారంభమైంది.

జాతీయ అథ్లెటిక్స్‌ షురూ

హనుమకొండ (స్పోర్ట్స్‌): హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ మాజీ చాంపియన్‌, హైజంపర్‌ అంజూ బాబీజార్జ్‌ అతిథిగా పోటీలను వీక్షించింది. తొలిరోజు.. మహిళల 5 వేల మీ.లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్‌ చౌధరి స్వర్ణం సాధించింది. మహారాష్ట్ర అథ్లెట్లు కోమల్‌ చంద్రకాంత్‌ జగ్దాలే, సంజీవని బాబర్‌ జాదవ్‌ రజత, కాంస్య పతకాలు నెగ్గారు. పురుషుల 5 వేల మీటర్ల పరుగులో అభిషేక్‌పాల్‌ (యూపీ) స్వర్ణం, ధర్మేందర్‌ (రైల్వేస్‌) రజతం, అజయ్‌కుమార్‌ (రైల్వేస్‌) కాంస్య పతకం గెలుపొందారు. పురుషుల డెకాథ్లాన్‌లో మొదటి రోజు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, షాట్‌ఫుట్‌, హైజంప్‌, 400 మీటర్ల పరుగు అంశాలను నిర్వహించారు. 

Updated Date - 2021-09-16T08:24:19+05:30 IST