సిరిసిల్ల: జిల్లాలోని వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామంలో పోడు భూముల వివాదం కొనసాగుతోంది. ఫారెస్ట్ అధికారులకు, దళితులకు మధ్య వాగ్వివాదం జరిగింది. గర్జనపల్లిలోని 80 ఎకరాల పోడు భూములను దళిత కుటుంబాలు సాగు చేస్తున్నాయి. హరితహారం మొక్కలను అటవీ శాఖ అధికారులు పెడుతుంటే గ్రామస్తులు అడ్డుకున్నారు. దళితులు విత్తనాలు వేయడానికి నేడు సాగు చేస్తుంటే అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు, దళితులకు మధ్య వాగ్వివాదం జరిగింది.