కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-09-25T06:57:43+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూసేకరణను త్వరితగతగిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ ఆదేశించారు

కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తి చేయాలి

 కలెక్టర్‌  అబ్దుల్‌ అజీమ్‌


భూపాలపల్లి కలెక్టరేట్‌, సెప్టెంబరు 24 : కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూసేకరణను త్వరితగతగిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన గురువారం రెవె న్యూ అధికారులు, కాశేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లతో సమావేశమయ్యారు. కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం ప్రాజె క్టుల భూసేకరణకు మహదేవపూర్‌, మల్హర్‌, కాటారం, మహాముత్తారం మండలాల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి ఆర్డీవో వై.వి.గణేష్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


పల్లెప్రకృతి వనాలను వేగవంతం చేయాలి

 పల్లె ప్రకృతి వనాలు, రైతువేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ అజీమ్‌ ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులతో ఆయన కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాల్లో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ గణేష్‌, డీపీవో సుధీర్‌ కుమార్‌, పంచాయతీరాజ్‌ ఈఈ రాంబాబు పాల్గొన్నా రు. అలాగే రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు.


బ్లడ్‌ స్టోరేజీ, మెడికల్‌ స్టోర్‌ నిర్వహణకు ఉపయోగపడేలా అన్ని సౌకార్యాలతో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైౖటీ జిల్లా కార్యాల యాన్ని నిర్మించాలని అన్నారు. సమావేశంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నా రు. అలాగే పశుసంవర్థక శాఖ, రూర్బన్‌ మిషన్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. రూర్బన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా నాగారం క్లస్టర్‌లో స్వ యం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో పశుసంవ ర్థక శాఖ అధికారి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


చిరువ్యాపారులకు ఉపాధి కల్పించాలి

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉపాధి కోల్పో యిన చిరువ్యాపారులకు ఉపాధి కల్పించాలని ముని సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్యను కలెక్టర్‌ ఆదేశించారు. స్ట్రీట్‌వెండర్స్‌కు ఉపాధి కల్పించే పథకం అమలుపై ఆయన మునిసిపల్‌ అధికారులతో సమావేశమై సమీక్షించారు. కమిషనర్‌కు పలు సూచనలు చేశారు.

Updated Date - 2020-09-25T06:57:43+05:30 IST