లక్ష్మణ్‌కు మరో కీలక బాధ్యత

ABN , First Publish Date - 2022-08-18T07:52:25+05:30 IST

బీజేపీ సీనియర్‌ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌కు పార్టీ జాతీయ నాయకత్వం మరో కీలక అవకాశం కల్పించింది.

లక్ష్మణ్‌కు మరో కీలక బాధ్యత

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా అవకాశం 

తెలంగాణ నుంచి తొలిసారిగా అత్యున్నత కమిటీలో చోటు

క్రమశిక్షణ గల కార్యకర్తకు దక్కిన గౌరవమిది: కె.లక్ష్మణ్‌

తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం: బండి 


హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్‌ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌కు పార్టీ జాతీయ నాయకత్వం మరో కీలక అవకాశం కల్పించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా ఆయనను నియమించింది. దీంతో ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రం నుంచి సభ్యుడిగా తొలిసారిగా అవకాశం దక్కించుకున్న నేత అయ్యారు. రెం డు తెలుగు రాష్ట్రాల తరఫున లక్ష్మణ్‌ నియామకం జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ బోర్డు తో పాటు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా కూడా లక్ష్మణ్‌ కొనసాగనున్నారు. విద్యార్థి సంఘం నేత గా రాజకీయాల్లోకి ప్రవేశించిన లక్ష్మణ్‌.. పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి గా, జాతీయ పార్టీ కార్యదర్శిగా కూడా పని చేశారు. కాగా, పార్లమెంటరీ బోర్డులో తనకు స్థానం దక్కడం క్రమశిక్షణ గల కార్యకర్తకు బీజేపీ జాతీయ నాయక త్వం కట్టబెట్టిన గౌరవమని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. ఈ అవకాశంతో జాతీయ నాయకత్వం తనపై బాధ్యతను మరింత పెంచినట్లుగా భావిస్తున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పా రు. పార్లమెంటరీ బోర్డులో, కేంద్ర ఎన్నికల కమిటీలో అవకా శం వస్తుందని తాను ఊహించలేదని, ఇలాంటి అవకాశం బీజేపీలో మాత్రమే సాధ్యమని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు.  కాగా, లక్ష్మణ్‌కు పార్లమెంటరీ బోర్డులో అవకాశం కల్పించడం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. 

Updated Date - 2022-08-18T07:52:25+05:30 IST