4 రోజులు.. రూ.10.36 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-01-22T08:19:47+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాలు వరుసగా నాలుగో రోజు కొనసాగాయి. స్టాక్‌ మార్కెట్ల పతనం మూలం గా నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.10.36 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు....

4 రోజులు.. రూ.10.36 లక్షల కోట్లు

 ఇన్వెస్టర్లు కోల్పోయిన సంపద ఇది

  427.44 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌


న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాలు వరుసగా నాలుగో రోజు కొనసాగాయి. స్టాక్‌ మార్కెట్ల పతనం మూలం గా నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.10.36 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన ట్రెండ్‌, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగించడం స్టాక్‌ మార్కెట్ల నష్టాలకు కారణమైంది. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 427.44 పాయింట్ల నష్టంతో 59,037.18 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 139.85 పాయింట్లు కోల్పోయి 17,617.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. చివర్లో కొన్ని బ్లూచిప్‌ కౌంటర్లలో జరిగిన కొనుగోళ్లు మార్కెట్ల నష్టాలు పరిమితమయ్యేందుకు దోహదపడ్డాయి. నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ 2,271.73 పాయింట్లు కోల్పోయింది. బలహీన ట్రెండ్‌ నేపథ్యంలో బీఎ్‌సఈలో నమోదైన  కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ నాలుగురోజుల్లో రూ.10,36,636.17 కోట్లు తగ్గి రూ.2,69,65,801.54 కోట్లకు చేరుకుంది. సోమవారం బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ జీవిత కాల గరిష్ఠం రూ.2,80,02,437.71 కోట్లకు చేరింది. ఇక శుక్రవారం ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా అన్ని బీఎ్‌సఈ సెక్టోరల్‌ సూచీలు నష్టాలతోనే ముగిశాయి.

Updated Date - 2022-01-22T08:19:47+05:30 IST