కువైత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసులకు బిగ్ షాక్..!

ABN , First Publish Date - 2022-02-10T14:20:12+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ 2017 సెప్టెంబర్‌లో తీసుకువచ్చిన కువైటైజేషన్ పాలసీతో ప్రవాసులకు చుక్కలు చూపిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితిలో కువైటీలకు భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో గడిచిన ఐదేళ్లలో స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

కువైత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసులకు బిగ్ షాక్..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ 2017 సెప్టెంబర్‌లో తీసుకువచ్చిన కువైటైజేషన్ పాలసీతో ప్రవాసులకు చుక్కలు చూపిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితిలో కువైటీలకు భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో గడిచిన ఐదేళ్లలో స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. సాధ్యమైనంతవరకు కీలకమైన రంగాల్లో ప్రవాసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇక కువైటైజేషన్ పాలసీలో భాగంగానే ఈ ఏడాది ఆగస్టు నాటికి ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ప్రవాస ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో కువైటీలను నియమించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆ దేశంలోని ఉపాధి ఏజెన్సీ అయిన సివిల్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. అయితే.. ఉపాధ్యాయులు, వైద్యులు, సేవా రంగంలో పని చేస్తున్నవారికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇక ఇప్పటికే పలు ప్రభుత్వ ఏజెన్సీలు నాన్-కువైటీలను నియమించుకోవడం మానేశాయి.  


ఇదిలాఉంటే.. కువైత్‌ మొత్తం జనాభా 40.60లక్షలుగా ఉంటే.. అందులో ఏకంగా 30.50లక్షలు ప్రవాసులే ఉన్నారు. దాంతో ఆటోమెటిక్‌గా వలసదారులు భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కొల్లగొడుతున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు కువైత్ సర్కార్ కువైటైజేషన్ పాలసీని తీసుకొచ్చింది. అలాగే గడిచిన కొన్నేళ్లుగా ప్రవాసుల పట్ల కువైత్ కఠినంగా వ్యవహరిస్తోంది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతోంది. అక్రమంగా దేశంలో నివాసం ఉంటున్న వారిని గుర్తించి వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇలా గతేడాది వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన సుమారు 18వేల మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించింది. అటు కోవిడ్-19 సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ భారీ పతనాన్ని చవిచూసిన నేపథ్యంలో విదేశీయుల ఉపాధిని పరిమితం చేయాలనే డిమాండ్ కువైత్‌లో బాగా పెరిగింది. 

Updated Date - 2022-02-10T14:20:12+05:30 IST