కువైట్‌లో మళ్లీ పెరిగిన కొత్త కేసులు !

ABN , First Publish Date - 2020-08-07T19:42:19+05:30 IST

గ‌ల్ఫ్ దేశ‌మైన కువైట్‌లో ఇటీవ‌ల కోవిడ్ పాజిటివ్ కేసులు కాస్తా త‌గ్గుముఖం ప‌ట్టినా... గురువారం మ‌ళ్లీ పెర‌గ‌డం క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

కువైట్‌లో మళ్లీ పెరిగిన కొత్త కేసులు !

కువైట్ సిటీ: గ‌ల్ఫ్ దేశ‌మైన కువైట్‌లో ఇటీవ‌ల కోవిడ్ పాజిటివ్ కేసులు కాస్తా త‌గ్గుముఖం ప‌ట్టినా... గురువారం మ‌ళ్లీ పెర‌గ‌డం క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. నిన్న ఒకేరోజు 651 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డ వారి సంఖ్య 69,425కు చేరింది. కాగా, 580 మంది క‌రోనా బాధితులు వైర‌స్‌ను జ‌యించి ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కావ‌డం ఊర‌ట‌నిచ్చే విష‌యం. ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా 60,906 మంది రిక‌వ‌రీ అయ్యార‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. అలాగే గురువారం సంభ‌వించిన మూడు కొత్త మ‌ర‌ణాల‌తో క‌లిపి క‌రోనాకు బ‌లైన వారు 468 మంది అయ్యారు. ప్ర‌స్తుతం దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో 8,051 కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 128 కండిష‌న్ సీరియ‌స్‌గా ఉందని ఆరోగ్య‌శాఖ పేర్కొంది. మ‌రోవైపు ఈ వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ముమ్మ‌రంగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న కువైట్‌... ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా 5,18,601 కోవిడ్ టెస్టులు పూర్తి చేసింది. ఇదిలా ఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న క‌రోనా ఇప్ప‌టికే 7.17 ల‌క్ష‌ల మందిని క‌బ‌ళించింది. కోటి 92 లక్ష‌ల మంది బాధితులు ఉన్నారు. ‌     

Updated Date - 2020-08-07T19:42:19+05:30 IST