టీకా వేయించుకోని దేశ‌ పౌరుల‌పై.. కువైట్ క‌ఠిన ఆంక్ష‌లు!

ABN , First Publish Date - 2021-05-18T16:27:20+05:30 IST

క‌రోనా టీకా వేయించుకోని దేశ పౌరులు, వారి ద‌గ్గ‌రి బంధువులు, వారి ఇళ్ల‌ల్లో ప‌నిచేసే కార్మికుల‌పై కువైట్ కఠిన ఆంక్ష‌లు విధించింది.

టీకా వేయించుకోని దేశ‌ పౌరుల‌పై.. కువైట్ క‌ఠిన ఆంక్ష‌లు!

కువైట్ సిటీ: క‌రోనా టీకా వేయించుకోని దేశ పౌరులు, వారి ద‌గ్గ‌రి బంధువులు, వారి ఇళ్ల‌ల్లో ప‌నిచేసే కార్మికుల‌పై కువైట్ కఠిన ఆంక్ష‌లు విధించింది. ఇక‌పై టీకా తీసుకోని వారు విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తించ‌బ‌డ‌ర‌ని స్ప‌ష్టం చేసింది. మే 22 నుంచి ఈ ఆంక్ష‌లు అమ‌లులోకి వ‌స్తాయ‌ని అక్క‌డి స‌ర్కార్ పేర్కొంది. ఈ మేర‌కు కువైట్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో అన్ని విమాయాన సంస్థ‌ల‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స‌ర్క్యూల‌ర్ పంపించింది. ఇక ప్ర‌వాసుల రాక‌పై నిషేధం కూడా త‌దుప‌రి నోటీసులు వచ్చే వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ఈ సంద‌ర్బంగా సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. ఇదిలాఉంటే.. భార‌త్‌లో కొన‌సాగుతున్న క‌రోనా విజృంభణ నేప‌థ్యంలో కువైట్ ఈ నెల మొద‌టి వారం నుంచి భార‌త విమానాల‌పై బ్యాన్ విధించిన విష‌యం తెలిసిందే.

Updated Date - 2021-05-18T16:27:20+05:30 IST