Kurnool: తుంగభద్ర ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-30T13:59:09+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరతుంది. అధికారులు 10 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు

Kurnool: తుంగభద్ర ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరతుంది. అధికారులు 10 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం: 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం: 1,632.47గా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ : 100 టీఎంసీలు ఉండగా..ప్రస్తుత నీటి నిల్వ : 98.816 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో: 62,146 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో: 56,203 క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2021-07-30T13:59:09+05:30 IST