Abn logo
Aug 9 2021 @ 07:38AM

Kurnool: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద  కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,27,417 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 62,076  క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 215 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 210 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.