కర్నూలు: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను గుర్తు తెలయని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ప్యాపిలి మండలం కలచట్ల దగ్గర చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.