విద్య, విజ్ఞానంతోనే ఆదివాసీల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-10T05:33:25+05:30 IST

విద్య, విజ్ఞానంతోనే ఆదివాసీల అభివృద్ధి

విద్య, విజ్ఞానంతోనే ఆదివాసీల అభివృద్ధి

  కేయూ క్యాంపస్‌, ఆగస్టు 9: విద్య, విజ్ఞానంతోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమని కేయూ జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌, కేయూ ఎన్‌ఎ్‌సఎ్‌స కో ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ఈసం నారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు పద్మ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఈసం నారాయణ  మాట్లాడారు. ఆదివాసీల హక్కులు, చట్టాలను విద్యతోనే సాఽధించుకుంటామని అన్నారు. 2022 ఏడాదిని ’ది రోల్‌ ఆఫ్‌ ది ఇండిజేషన్‌ వుమెన్‌్‌స ఇన్‌ ది ప్రిజర్వేషన్‌ అండ్‌ ట్రామ్స్‌మిషన్‌ ఆఫ్‌ టేడిషనల్‌ నాలెడ్జ్‌ ’ ప్రపంచ ఆదివాసీ థీమ్‌గా గుర్తించిందని చెప్పారు. మొదటి ఆదివాసీ మహిళ  రాష్ట్రపతిగా నియామితులు కావడంపై అభినందనీయమన్నారు. బిర్సాముండా, కొమురంభీం,రాంజీగొండు పోరాటన్నీ భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాటాలు చేశారని అన్నారు. ఆదివాసీల హక్కులను రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో పేర్కొన్నారని వివరించారు. 1/70 చట్టాలన్ని ప్రభుత్వాలను అమలు చేయాలని డిమాండ్‌ చశారు. ఆదివాసీ విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో చేరి ఉద్యోగ అవకాశాలను పొందాలని అన్నారు. సదస్సులో కొమురంభీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సదస్సులో ఆదివాసీ పరిశోధక విద్యార్థులు ఆసం ఆనంద్‌, చీమల బుచ్చయ్య, వంశీ, విజయ్‌కుమార్‌, అజయ్‌, శిరీష, రమ్యశ్రీ, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:33:25+05:30 IST