Advertisement
Advertisement
Abn logo
Advertisement

పర్వతారోహకురాలు పూర్ణకు కేటీఆర్‌ అభినందన

తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్‌ పూర్ణను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ప్రగతి భవన్‌లో గురువారం మంత్రిని పూర్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. తన జీవితం ఆధారంగా వచ్చిన ‘‘పూర్ణ’’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయనకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం వల్లే తాను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించగలిగానని తెలిపారు. భవిష్యత్తులో కూడా గతం మాదిరిగానే ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమెకు మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

Advertisement
Advertisement