‘అగ్నిపథ్’ను పునఃసమీక్షించాలి: కేటీఆర్

ABN , First Publish Date - 2022-06-18T00:12:12+05:30 IST

Hyderabad: వివాదస్పద ‘అగ్నిపథ్’ను పునఃసమీక్షించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె తారకరామారావు ఒక ప్రకటనలో కేంద్రాన్ని కోరారు. ఆర్మీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువకుల అశలపై నీళ్లు చల్లేలా కేంద్రం నిర్ణయం ఉందని పేర్కొన్నారు.

‘అగ్నిపథ్’ను పునఃసమీక్షించాలి: కేటీఆర్

Hyderabad: వివాదస్పద ‘అగ్నిపథ్’ను పునఃసమీక్షించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె తారకరామారావు ఒక ప్రకటనలో కేంద్రాన్ని కోరారు. ఆర్మీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువకుల అశలపై నీళ్లు చల్లేలా కేంద్రం నిర్ణయం ఉందని పేర్కొన్నారు. 

 నిరుద్యోగ సమస్య తీవ్రతకు దర్ఫణం

‘‘అగ్నిపథ్‌పై కొనసాగుతున్నఆందోళనలు దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. కేంద్రం కళ్లుతెరిచి ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎలాంటి చర్చ లేకుండా ఏకపక్షంగా, నియంతృత్వ పూరితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలాంటి దుష్పరిణామాలు. దేశంలో జరుగుతున్న అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత. జై జవాన్-జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో, మొన్నటిదాకా నల్ల రైతు చట్టాలతో రైతుల గోస గుచ్చుకున్న కేంద్రం, ఇప్పుడు ఈ అనాలోచిత విధానంతో జవాన్లను నిర్వేదంలోకి నెడుతోంది. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి ఆర్మీని ఈ రోజు నో ర్యాంక్ –నో పెన్షన్ స్థాయికి దిగజార్చింది. బీజేపీ ప్రభుత్వం దేశభద్రతను సైతం కాంట్రాక్ట్ విధానానికి అప్పజెప్పడం, దేశభద్రతపైన వారి డొల్లవిధానాలకు నిదర్శనం. అగ్నిపథ్ విధానం ద్వారా కేవలం నాలుగు సంవత్సరాల పాటు ఆర్మీలో విధులు నిర్వహించిన యువతలో, 75శాతం తిరిగి నిరుద్యోగులుగా మారుతారు. యుక్తవయసులో ఆర్మీలో చేరి నాలుగు సంవత్సరాలకే బయటకు పంపిస్తే, తర్వాత వారికి ఉపాధి అవకాశాలు దక్కేదెలా?. యువకుడి మృతి‌కి కేంద్రమే బాధ్యత వహించాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.  

Updated Date - 2022-06-18T00:12:12+05:30 IST