Abn logo
Jul 31 2021 @ 19:01PM

కృష్ణా: రెండు గ్రామాలలో లాక్ డౌన్

కృష్ణా: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడి దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీరులపాడు మండలంలోని దోడ్డదేవరపాడు, కొనతాలపల్లి గ్రామాలలో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ఆయా గ్రామాలలో అధికారులు లాక్‌డౌన్ విధించారు. వారం రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు.