Advertisement
Advertisement
Abn logo
Advertisement

కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల మట్టి దందా

మైలవరం: కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో మట్టి మాఫియా హల్‌చల్‌ చేస్తోంది. చంద్రాల గ్రామంలో చెరువు మట్టిని మట్టి మాఫియా దోచేస్తోంది. చంద్రాల గ్రామంలో వైసీపీ నేతల మట్టి దందాకు పాల్పడుతున్నారు. మట్టి దందాలో వైసీపీ ప్రధాన నాయకుడి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వందల ట్రాక్టర్లతో సమీప ఇటుక బట్టీలకు మట్టి తరలించారు. ఒక్కో ట్రక్కు మట్టి రూ.600 చొప్పున ఇటుక బట్టీలకు తరలించారని స్థానికులు చెబుతున్నారు. మట్టి దందా గురించి అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. మట్టి, ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ నేతలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పూర్తి సహకారం ఉందనే ఆరోపలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాను అరికట్టాలని, చెరువు ఆయకట్టు రైతులు, గ్రామ ప్రజల డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement