లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రభుత్వ ఆమోదం: క్రాంతి కిరణ్
ABN , First Publish Date - 2021-09-17T14:40:23+05:30 IST
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. సీఎం కేసీఆర్‌కు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.
సంగారెడ్డి: సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. సీఎం కేసీఆర్‌కు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. రూ.4,4274 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంతో 3 లక్షల 84 వేల ఎకరాలకు నీరు అందనుందని క్రాంతి కిరణ్ వెల్లడించారు. చెంతనే సింగూర్ జలాలు ఉన్నా కూడా ఇన్నాళ్లు వాడుకోలేని దుస్థితి ఉండే దాన్నుంచి కేసీఆర్ విముక్తి కలిగించారన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్న కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.