కోతులపై ‘కొవాగ్జిన్‌’ ప్రయోగాలు సఫలం

ABN , First Publish Date - 2021-03-04T08:07:35+05:30 IST

భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌తో కోతులపై నిర్వహించిన పరీక్షలు సఫలమయ్యాయి. వ్యాక్సిన్‌ ఇచ్చిన మూడు వారాల తర్వాత కోతుల్లో ఐజీజీ యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు.

కోతులపై ‘కొవాగ్జిన్‌’ ప్రయోగాలు సఫలం

హైదరాబాద్‌, మార్చి 3: భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌తో కోతులపై నిర్వహించిన పరీక్షలు సఫలమయ్యాయి. వ్యాక్సిన్‌ ఇచ్చిన మూడు వారాల తర్వాత కోతుల్లో ఐజీజీ యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. మొత్తం 20 కోతులపై ఈ ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ అధ్యయన నివేదిక ‘నేచర్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. 3 మైక్రోగ్రాముల మోతాదు కలిగిన రెండు వ్యాక్సిన్‌ డోసులు అందించిన కోతులకు వైరస్‌ నుంచి బలమైన రక్షణ లభించిందని అధ్యయన నివేదికలో ప్రస్తావించారు. 

Updated Date - 2021-03-04T08:07:35+05:30 IST