ఎస్‌బీఐకి కోటక్ మహీంద్రా బ్యాంక్ షాక్...

ABN , First Publish Date - 2021-04-13T21:51:47+05:30 IST

మహీంద్రా బ్యాంక్‌లో చౌక వడ్డీకే రుణాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ రుణ గ్రహీతలకు తీపికబురునందించింది.

ఎస్‌బీఐకి కోటక్ మహీంద్రా బ్యాంక్ షాక్...

హైదరాబాద్ : కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో చౌక వడ్డీకే రుణాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ రుణ గ్రహీతలకు తీపికబురునందించింది. హోమ్ లోన్స్‌పై ప్రత్యేకమైన వడ్డీ రేట్లను అలాగే కొనసాగిస్తోంది. వాస్తవానికి... కిందటి ఆర్ధిక సంవత్సరం(2020-21) ముగిసిన మార్చి 31 తోనే ప్రత్యేక వడ్డీ రేట్ల ఆఫర్ ముగియాల్సి ఉంది. అయితే... బ్యాంక్ మాత్రం ఈ వడ్డీ రేట్లను ఇప్పటికీ అలాగే కొనసాగిస్తోంది.


హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కోటక్ బ్యాంక్‌లో హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 6.65 శాతంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లోని వడ్డీ రేట్లను గమనిస్తే... కోటక్ బ్యాంక్‌లోనే హోమ్ లోన్స్‌పై తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి. కోటక్ బ్యాంక్ నిర్ణయం దేశీ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కి ఝలక్ అని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ కూడా గత నెలలో 6.7 శాతం వడ్డీకే హోమ్ లోన్స్ అందించిన విషయం తెలిసిందే.  అయితే మార్చి 31 తర్వాత ఈ వడ్డీ రేటు 6.95 శాతానికి పెంచింది. ప్రత్యేక డిస్కౌంట్ రేట్లను ఎస్‌బీఐ మార్చి 31 వరకే అందుబాటులో ఉంచింది. అయితే కోటక్ బ్యాంక్ మాత్రం ఈ రేట్లను అలాగే కొనసాగించింది.


బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి అవకాశమేరరి చెబుతున్నారు.  ఎందుకంటే హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు పదిహేనేుళ్ల కనిష్ట స్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలో... హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తే... ఇప్పుడే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. 

Updated Date - 2021-04-13T21:51:47+05:30 IST