వడ్డీ రేట్లను సవరించిన కోటక్ మహీంద్రా ...

ABN , First Publish Date - 2020-10-29T00:48:21+05:30 IST

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించింది. దీంతో బ్యాంకులో డబ్బులు దాచుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడనుందని భావిస్తున్నారు.

వడ్డీ రేట్లను సవరించిన కోటక్ మహీంద్రా ...

ముంబై : ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించింది. దీంతో బ్యాంకులో డబ్బులు దాచుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడనుందని భావిస్తున్నారు.


బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం అక్టోబర్ 22 నుంచే అమలులోకి వచ్చింది. అంటే...  ఇప్పుడు బ్యాంకుకు వెళ్లి డబ్బులు ఎఫ్‌డీ చేయాలని భావిస్తే... గతంలో కన్నా తక్కువ రాబడి వస్తుంది. బ్యాంకులో ఇప్పుడు డబ్బులు ఎఫ్‌డీ చేస్తే కొత్త రేట్ల ప్రాతిపదికన 2.5 శాతం నుంచి 5 శాతం మధ్యలో వడ్డీ లభిస్తుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


ఏడు రోజుల నుంచి 30 రోజులు, 31 రోజుల నుంచి 90 రోజులు, 91 రోజుల నుంచి 179 రోజుల కాల వ్యవధిలో మెచ్యూరిటీ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వరుసగా 2.5 శాతం, 3 శాతం, 3.5 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. అదే 180 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై కోటక్ మహీంద్రా బ్యాంక్ 4.5 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.


ఇకపోతే ఏడాది నుంచి 389 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.6 శాతం వడ్డీ వస్తుంది. ఇక 391 రోజుల నుంచి 23 నెలలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.9 శాతం వడ్డీని పొందొచ్చు. అదే 23 నెలల నుంచి రెండేళ్ల లోపు ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 


రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై 4.9 శాతం, 3-4 ఏళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.8 శాతం, 4-5 Oళ్లలోపు ఎఫ్‌డీలపై 4.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక 5-10 ఏళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.5 శాతం వడ్డీని పొందొచ్చు. కాగా... సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభిస్తుంది.

Updated Date - 2020-10-29T00:48:21+05:30 IST