కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు..పెరిగినభక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-04-16T12:48:19+05:30 IST

నేడు (శనివారం) చిన్న హనుమాన్‌ జయంతి కావడంతో కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. రామ లక్ష్మణ జానకీ, జై భోలో హనుమాన్‌ కీ..

కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు..పెరిగినభక్తుల రద్దీ

జగిత్యాల: నేడు (శనివారం) చిన్న హనుమాన్‌ జయంతి కావడంతో కొండగట్టుకు భక్తులు పోటెత్తారు.  రామ లక్ష్మణ జానకీ, జై భోలో హనుమాన్‌ కీ.. అంటూ వేలాదిగా తండోప తండాలుగా కొండమీదకు తరలివస్తున్నారు. అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి వారిని దర్శంచుకునేందుకు భక్తులు దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఆంజనేయస్వామి దర్శనానికి సుమారుగా 4 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-04-16T12:48:19+05:30 IST