బీజేపీలోకి కొండా విశ్వేశ్వరరెడ్డి!

ABN , First Publish Date - 2020-11-21T03:47:27+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి భూపేందర్‌ యాదవ్ కలిసినట్లు తెలుస్తోంది. విశ్వేశ్వర్‌రెడ్డిని బీజేపీలోకి ..

బీజేపీలోకి కొండా విశ్వేశ్వరరెడ్డి!

హైదరాబాద్‌: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి భూపేందర్‌ యాదవ్ కలిసినట్లు తెలుస్తోంది. విశ్వేశ్వర్‌రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. భూపేందర్ యాదవ్ విజ్ఞప్తిపై విశ్వేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 


మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ ఇప్పటికే కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. సర్వే సత్యనారాయణను బీజేపీలోకి ఆహ్వానించారు. ఇందుకు సర్వే సత్యనారాయణ సానుకూలంగా స్పందించారు. బీజేపీలో చేరుతున్నానని సర్వే ప్రకటించారు. త్వరలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. 


ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వరుస కాంగ్రెస్ నేతలంతా బీజేపీ బాట పట్టడంతో జీహెచ్ ఎంసీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలనుంది. 

Updated Date - 2020-11-21T03:47:27+05:30 IST