Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 16 2020 @ 17:26PM

మాజీ ఎంపీ తులసీరామ్ సేవలను గుర్తు చేసుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: మాజీ ఎంపీ వి. తులసీరామ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తులసీరామ్ సేవలను గుర్తు చేసుకున్న ఆయన.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్దపల్లి, నాగర్ కర్నూల్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారని, పలు సంఘాల్లో కీలక  బాధ్యతలు నిర్వహించారన్నారు. హరిజన సంక్షేమం, సర్వోదయ ట్రస్ట్, గాంధీ ఆశ్రమం, కార్మిక సంఘాలలో చురుకైన పాత్ర పోషించారన్నారు. 


గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తులసీ రామ్ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. సర్పంచ్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. పార్లమెంట్ సభ్యుడి స్థాయికి ఎదిగారు. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రజాసమితి, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో వివిధ హోదాల్లో పని చేశారు. రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 

Advertisement
Advertisement