KomatiReddy VenkatReddy: నేనూ రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ABN , First Publish Date - 2022-08-13T21:26:47+05:30 IST

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (KomatiReddy VenkatReddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి జరుగుతుందంటే తానూ రాజీనామా చేస్తానని ప్రకటించారు.

KomatiReddy VenkatReddy: నేనూ రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (KomatiReddy VenkatReddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి జరుగుతుందంటే తానూ రాజీనామా చేస్తానని ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నిక (Munugode by-election) సెమీ ఫైనల్ అని తెలిపారు. తనను సంప్రదించకుండానే కాంగ్రెస్ (Congress) పెద్దలు కమిటీ వేశారని, ఉపఎన్నిక విషయం ఇక వాళ్లే చూసుకుంటారని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్‌ బయటకు వస్తారని, ఆ నియోజకవర్గానికి మాత్రమే వరాలు కురిపిస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తనను పిలవలేదని, అందుకే ఆ ఉప ఎన్నికకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నిర్వహించిన సమావేశాలకు పార్టీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ మీటింగ్‌ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. సమావేశానికి రావాలని ఆహ్వానించకపోతే ఎలా వెళ్లాలి? చండూరులో జరిగిన బహిరంగ సభలో నన్ను అసభ్యంగా తూలనాడారు. హోం గార్డుతో పోల్చారు. దీని వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. పార్టీ నుంచి నన్ను బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. అవమానిస్తే పార్టీ నుంచి నా అంతట నేనే వెళ్లిపోతానని అనుకుంటున్నారు. నన్ను వెళ్లగొట్టి కాంగ్రెస్‌ను ఖాళీ చేద్దామనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. జరుగుతున్న విషయాలన్నింటినీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, నాయకుడు రాహుల్‌ గాంధీకి వివరిస్తానన్నారు.


మునుగోడు నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే పాదయాత్రకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని కూడా ఆహ్వానించామని మాజీ మంత్రి, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి తెలిపారు. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎంపీ వెంకట్‌ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈనెల 13న సంస్థాన్‌ నారాయణపురం మండలం నుంచి చౌటుప్పల్‌ వరకు 5 వేల మందితో జరిగే అజాదీకాగౌరవ్‌ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్రస్థాయి నేతలందరూ పాల్గొంటారని చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని, అనంతరం చౌటుప్పల్‌లో సభ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Updated Date - 2022-08-13T21:26:47+05:30 IST