కోల్‌కతా.. ఎట్టకేలకు

ABN , First Publish Date - 2021-04-27T09:30:20+05:30 IST

బౌలర్ల సమష్ఠి ప్రదర్శనకు తోడు కెప్టెన్‌ మోర్గాన్‌ (40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్‌) చాలా రోజుల తర్వాత బ్యాట్‌ ఝుళిపించాడు. దీంతో సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన

కోల్‌కతా.. ఎట్టకేలకు

పంజాబ్‌పై విజయం


అహ్మదాబాద్‌: బౌలర్ల సమష్ఠి ప్రదర్శనకు తోడు కెప్టెన్‌ మోర్గాన్‌ (40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్‌) చాలా రోజుల తర్వాత బ్యాట్‌ ఝుళిపించాడు. దీంతో సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (34 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 31), జోర్డాన్‌ (18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 30) రాణించారు. ప్రసిద్ధ్‌ కృష్ణకు 3, కమిన్స్‌.. నరైన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లకు 126 పరుగులు చేసి గెలిచింది. త్రిపాఠి (32 బంతుల్లో 7 ఫోర్లతో 41) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మోర్గాన్‌ నిలిచాడు.


తడబడి.. నిలబడ్డారు: 124 పరుగుల ఛేదనను కోల్‌కతా అంత సునాయాసంగా పూర్తి చేయలేకపోయింది. తొలి 3 ఓవర్లలోనే రాణా (0), గిల్‌ (9), నరైన్‌ (0) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 17. ఈ దశలో సంచలన ఫలితం వస్తుందేమోననిపించింది. కానీ త్రిపాఠి, మోర్గాన్‌ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. నాలుగో వికెట్‌కు 48 బంతుల్లో 66 రన్స్‌ జోడించారు. త్రిపాఠి 11వ ఓవర్‌లో అవుటవగా, రస్సెల్‌ (10) 15వ ఓవర్‌లో రనౌటయ్యాడు. అయితే ఒక్కసారిగా జోరు పెంచిన మోర్గాన్‌ 16వ ఓవర్‌లో 4,6 బాదగా లక్ష్యం 24 బంతుల్లో 9కి మారి విజయం లాంఛనమైంది.


ఆదినుంచీ తడబాటే: టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను కోల్‌కతా బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. దీంతో తొలి పది ఓవర్లలో 56 పరుగులే చేసి రాహుల్‌ (19), క్రిస్‌ గేల్‌ (0), దీపక్‌ హుడా (1) వికెట్లను చేజార్చుకుంది. అటు క్రీజులో కుదురుకున్న మయాంక్‌ పదో ఓవర్‌లో సిక్సర్‌ బాదినా ఎంతోసేపు నిలువలేదు. నరైన్‌ ఓవర్‌లో త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చాడు. 13వ ఓవర్‌లో పూరన్‌ (19) 6,4తో ఆశలు రేపినా వరుణ్‌ చేతిలో బౌల్డయ్యాడు. హెన్రిక్స్‌ (2), షారుక్‌ (13), బిష్ణోయ్‌ (1) స్వల్ప వ్యవధిలోనే అవుటవగా.. చివరి రెండు ఓవర్లలో జోర్డాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 19వ ఓవర్‌లో 4,6.. ఆఖరి ఓవర్‌లో 6,6 బాది నాలుగో బంతికి అవుటయ్యాడు.


స్కోరుబోర్డు

పంజాబ్‌: రాహుల్‌ (సి) నరైన్‌ (బి) కమిన్స్‌ 19; మయాంక్‌ (సి) త్రిపాఠి (బి) నరైన్‌ 31; గేల్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) మావి 0; దీపక్‌ హుడా (సి) మోర్గాన్‌ (బి) ప్రసిద్ధ్‌ 1; పూరన్‌ (బి) వరుణ్‌ 19; హెన్రిక్స్‌ (బి) నరైన్‌ 2; షారుక్‌ (సి) మోర్గాన్‌ (బి) ప్రసిద్ధ్‌ 13; జోర్డాన్‌ (బి) ప్రసిద్ధ్‌ 30; బిష్ణోయ్‌ (సి) మోర్గాన్‌ (బి) కమిన్స్‌ 1; షమి (నాటౌట్‌) 1; అర్ష్‌దీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 123/9. వికెట్ల పతనం: 1-36, 2-38, 3-42, 4-60, 5-75, 6-79, 7-95, 8-98, 9-121. బౌలింగ్‌: శివమ్‌ మావి 4-0-13-1; కమిన్స్‌ 3-0-31-2; నరైన్‌ 4-0-22-2; ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-30-3; రస్సెల్‌ 1-0-2-0; వరుణ్‌ 4-0-24-1.


కోల్‌కతా:  గిల్‌ (ఎల్బీ) షమి 9, నితీష్‌ రాణా (సి) షారుక్‌ (బి) హెన్రిక్స్‌ 0, రాహుల్‌ త్రిపాఠి (సి) షారుక్‌ (బి) హుడా 41, నరైన్‌ (సి) రవి బిష్ణోయ్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, మోర్గాన్‌ (నాటౌట్‌) 47, రస్సెల్‌ (రనౌట్‌) అర్ష్‌దీ్‌ప/రాహుల్‌ 10, దినేష్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 16.4 ఓవర్లలో 126/5. వికెట్ల పతనం: 1-5, 2-9, 3-17, 4-83, 5-98. బౌలింగ్‌: హెన్రిక్స్‌ 1-0-5-1, మహ్మద్‌ షమి 4-0-25-1, అర్ష్‌దీప్‌ సింగ్‌ 2.4-0-27-1, రవి బిష్ణోయ్‌ 4-0-19-0, జోర్డాన్‌ 3-0-24-0, దీపక్‌ హుడా 2-0-20-1. 

Updated Date - 2021-04-27T09:30:20+05:30 IST