శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా చూడాలని ఉంది: డీన్ జోన్స్

ABN , First Publish Date - 2020-08-10T04:07:52+05:30 IST

యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ను ఓపెనర్‌గా చూడాలనుకుంటున్నానని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ చెప్పాడు. ఐపీఎల్-2020ని...

శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా చూడాలని ఉంది: డీన్ జోన్స్

కాన్‌బెర్రా: యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ను ఓపెనర్‌గా చూడాలనుకుంటున్నానని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ చెప్పాడు. ఐపీఎల్-2020ని దృష్టిలో ఉంచుకుని జోన్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో గిల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా డీన్ జోన్స్ మాట్లాడుతూ, గిల్‌తో ఓపెనింగ్ చేయించేలా కేకేఆర్ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ‘గిల్‌కు ఇదో మంచి అవకాశం. కేకేఆర్ కూడా గిల్‌తో ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుంది. అతడికి ఆ సత్తా ఉంద’ని జోన్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గిల్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌ల్లో ఆడాడు. అందులో 499 పరుగులు చేశాడు.

Updated Date - 2020-08-10T04:07:52+05:30 IST