Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోహ్లీ సరికొత్త రికార్డ్.. విండీస్ దిగ్గజాన్ని వెనక్కి తోసి మరీ..

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇంగ్లండ్‌పై సూపర్ విక్టరీతో కోహ్లీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ గెలుపుతో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు సోమవారం ముగిసిన విషయం తెలిసిందే. భారత బౌలర్లు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టడంతో టీమిండియా 151 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసింది. కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన టెస్టుల్లో టీమిండియా సాధించిన 37వ విజయం ఇది. ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్ చరిత్రలో ఇన్ని టెస్టుల్లో విజయం సాధించిన నాలుగో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలోనే విండీస్ మాజీ దిగ్గజ ఆటగాడు, అప్పటి కెప్టెన్ క్లైవ్ లాయిడ్(36 విజయాలు) రికార్డును అధిగమించాడు. అయితే 36 విజయాలకు క్లైవ్ లాయిడ్ 74 మ్యాచ్‌లు పట్టగా.. కోహ్లీ మాత్రం 63 మ్యాచ్‌లలోనే ఆ రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం. 

Advertisement
Advertisement