Abn logo
Aug 1 2020 @ 23:19PM

అలాంటి బౌలర్లను మెచ్చుకుంటాడు.. కోహ్లీకి సైనీ కితాబు

న్యూఢిల్లీ: టీమిండియా సారధి విరాట్ కోహ్లీపై యువ బౌలర్ నవదీప్ సైనీ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఎప్పుడూ బౌలర్లు చెప్పేది వింటాడని సైనీ చెప్పాడు. జట్టు ప్లాన్ ప్రకారమే బౌలింగ్ చేయాలని కోహ్లీ చెప్తాడని, కానీ ఆ ప్లాన్ పనిచేయకపోతే వెంటనే బౌలర్‌కు అండగా నిలబడతాడని కొనియాడాడు. ‘జట్టు పథకం పనిచేయకపోతే బౌలర్‌‌ను కోహ్లీ సలహా అడుగుతాడు. అతను చెప్పేది జాగ్రత్తగా వింటాడు. బౌలర్ ప్లాన్‌కు ఏమైనా మార్పులు చేయాలంటే చెప్తాడు’ అని సైని వెల్లడించాడు. అలానే ఆటపై అభిప్రాయాలు వెల్లడించే బౌలర్లను కోహ్లీ మెచ్చుకుంటాడని పేర్కొన్నాడు.

Advertisement