కోహ్లీ, రోహిత్‌కు రూ.7 కోట్లు

ABN , First Publish Date - 2021-04-16T06:04:13+05:30 IST

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రా.. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో ఎ+ గ్రేడ్‌ను పదిలం చేసుకొన్నారు...

కోహ్లీ, రోహిత్‌కు రూ.7 కోట్లు

  • బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు


న్యూఢిల్లీ: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రా.. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో ఎ+ గ్రేడ్‌ను పదిలం చేసుకొన్నారు. ఈ టాప్‌ గ్రేడ్‌కు బీసీసీఐ వార్షిక వేతనంరూ.7 కోట్లు చెల్లించనుంది. ఆల్‌రౌండర్‌ హార్డిక్‌ పాండ్యాకు ‘బి’ నుంచి ‘ఏ’ గ్రేడ్‌కు ప్రమోషన్‌ లభించింది. దీంతో హార్డిక్‌ ఏడాదికి రూ.5 కోట్లు అందుకోనున్నాడు. ఈసారి మొత్తం 28 మంది క్రికెటర్లకు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లభించింది. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌కు తొలిసారి కోటి రూపాయల ‘సి’ గ్రేడ్‌ దక్కింది.


ఎవరి గ్రేడ్‌ ఏమిటి?

ఎ+ గ్రేడ్‌ (రూ.7 కోట్లు): విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా.


ఎ గ్రేడ్‌ (రూ.5 కోట్లు): అశ్విన్‌, రవీంద్ర జడేజా, చటేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానె, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, షమి, ఇషాంత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, హార్డిక్‌ పాండ్యా. 


బి గ్రేడ్‌ (రూ.3 కోట్లు): సాహా, ఉమేష్‌ యాదవ్‌, భువనేశ్వర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మయాంక్‌ అగర్వాల్‌.


సి గ్రేడ్‌ (రూ.1 కోటి): కుల్దీప్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ, దీపక్‌ చాహర్‌, శుభ్‌మన్‌ గిల్‌, హనుమ విహారి, అక్షర్‌ పటేల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌. 


Updated Date - 2021-04-16T06:04:13+05:30 IST