Advertisement
Advertisement
Abn logo
Advertisement

రేపు కోడెల విగ్రహవిష్కరణ.. వెళ్లకూడదని అచ్చెన్నాయుడు నిర్ణయం!

గుంటూరు: సత్తెనపల్లిలోని అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల విగ్రహావిష్కరణ వివాదంపై టీడీపీ అధిష్టానం ఆరా తీసింది. గురువారం కండ్లకుంటలో కోడెల విగ్రహావిష్కరణకు కోడెల శివరాం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లకూడదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు, ఇతర నేతలు నిర్ణయం తీసుకున్నారు. వివాదం పరిష్కారం అయ్యేవరకు వేచి చూడాలని పార్టీ పెద్దల నిర్ణయించినట్లు తెలుస్తోంది. అచెన్న, మాజీమంత్రి దేవినేని ఉమ హాజరవుతారంటూ ఇప్పటికే ఆహ్వాన పత్రికలను శివరాం వర్గం పంచింది. శివరాం ఏర్పాటు చేసే కార్యక్రమానికి రావద్దంటూ స్థానిక టీడీపీ నేతల విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అచ్చనాయుడు మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లిలో పార్టీ వివాదం పరిష్కారం అయ్యేలా దృష్టి పెడతానని ప్రకటించారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement