Abn logo
Feb 21 2020 @ 04:32AM

కోహ్లీ సేనకు వెల్లింగ్టన్‌ సవాల్‌

వన్డే సిరీ్‌సలో అనూహ్యంగా వైట్‌వా్‌షకు గురైన టీమిండియా.. టెస్ట్‌ సిరీ్‌సతో మళ్లీ గెలుపు బాటపట్టాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీ20 సిరీ్‌సలో ఘోరంగా ఓడినా.. వన్డేల్లో పుంజుకున్న న్యూజిలాండ్‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. పైగా తొలి టెస్ట్‌కు వేదికైన వెల్లింగ్టన్‌లో భారత్‌ రికార్డు పేలవంగా ఉండడం కూడా ఆతిథ్య జట్టుకు కలసి వచ్చే అంశం. మొత్తంగా చూస్తే ఇరు జట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తున్నా.. భిన్నమైన వాతావరణం ఉన్న వెల్లింగ్టన్‌లో గెలుపు గాలులు ఎటువైపు వీస్తాయో!

 బలమైన గాలులతోనే పరీక్ష

 కివీస్ -భారత్‌ తొలి టెస్ట్‌ నేటి నుంచి


వెల్లింగ్టన్‌: టెస్ట్‌ల్లో టాప్‌ ర్యాంక్‌లో దూసుకెళ్తున్న టీమిండియాకు పరీక్షా కాలం. వన్డే సిరీస్‌లో వైట్‌వా్‌షకు గురైన కోహ్లీ సేన.. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌పలో అసలు సిసలు సవాల్‌ను ఎదుర్కోనుంది. రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా శుక్రవారం నుంచి జరిగే తొలి టెస్ట్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో తలపడనుంది. పేపర్‌ మీద చూస్తే టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. సొంతగడ్డపై ఆడడం కివీ్‌సకు అదనపు బలం. మ్యాచ్‌ సాగేకొద్దీ ప్రత్యర్థిని అలసిపోయేలా చేయడంలో విలియమ్సన్‌ సేన అనుభవం గడించింది. 2017, మార్చిలో చివరిసారి సొంతగడ్డపై కివీస్‌ టెస్ట్‌ సిరీస్‌ ఓడింది. ఆ తర్వాత 5 సిరీ్‌సలు నెగ్గింది. ఆస్ట్రేలియా చేతిలో 0-3తో టెస్ట్‌ సిరీస్‌ చేజార్చుకున్న న్యూజిలాండ్‌.. ఎలాగైనా మళ్లీ గాడిలో పడాలనుకుంటోంది. మరోవైపు టీమిండియా గతేడాది ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు కివీ్‌సపై కూడా అదే ఘనతను అందుకోవాలనే పట్టుదలతో ఉంది. 


పవనాలతో పరీక్ష: మ్యాచ్‌ వేదికైన బేసిన్‌ రిజర్వ్‌ గ్రౌండ్‌లో అడ్డంగా వీచే పవనాలు ఇటు బ్యాట్స్‌మెన్‌కు, అటు బౌలర్లకు సవాల్‌. ఈ నేపథ్యంలో కొత్త ఓపెనింగ్‌ జోడీ పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌కు కివీస్‌ పేసర్లు బౌల్ట్‌, సౌథీతోపాటు అరంగేట్రం చేసే అవకాశాలున్న కైల్‌ జేమీసన్‌లను ఎదుర్కోవడం పరీక్షే! కానీ, లెఫ్టామ్‌ పేసర్‌ నీల్‌ వాగ్నర్‌ దూరమవడం భారత మిడిలార్డర్‌కు ఊరటనిచ్చే అంశం. కాగా, ఆకాశం మేఘావృతమైన పరిస్థితుల్లో కోహ్లీ టాస్‌ గెలిస్తే బౌలింగ్‌ ఎంచుకొనే అవకాశాలున్నాయి. పిచ్‌ అనుకూలించేంత వరకు టీమిండియా ఆటగాళ్లు ఎంతో సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కోహ్లీ చెప్పాడు. జడేజాతో పోల్చితే స్పిన్నర్‌ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికెట్‌ కీపర్‌గా సాహా, రిషభ్‌ పంత్‌లో మేనేజ్‌మెంట్‌ ఎవరివైపు మొగ్గుచూపుతుందో చూడాలి. మరోవైపు న్యూజిలాండ్‌ నలుగురు  పేసర్లను రంగంలోకి దించనుంది. ఐదో బౌలర్‌గా ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ను జట్టులోకి తీసుకోనుంది. 


సీనియర్లు మార్గదర్శనం చేయాలి: వెల్లింగ్టన్‌లో బలమైన గాలులను ఇరుజట్ల కెప్టెన్లూ దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి పిచ్‌లపై ఎలా ఆడాలనేది కొత్త ఆటగాళ్లు పృథ్వీ, మయాంక్‌, విహారిలకు కోహ్లీ, పుజార, రహానె సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. ఇషాంత్‌ తుది జట్టులో ఉండేది అనుమానమే. అదే జరిగితే ఉమేష్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చే చాన్సులున్నాయి. 


100 మూడు ఫార్మాట్లలో వందేసి మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా కివీస్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. 


52 వెల్లింగ్టన్‌లో భారత్‌ చివరిసారిగా 1968లో  మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ 

నేతృత్వంలో టెస్ట్‌ నెగ్గింది. మరి.. 52 ఏళ్ల తర్వాత విరాట్‌ సేన ఆ ఘనతను అందుకుంటుందో లేదో చూడాలి.


పిచ్‌/వాతావరణం 

మ్యాచ్‌ సాగేకొద్దీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కానీ, బలమైన గాలుల నుంచి బ్యాట్స్‌మెన్‌, బౌలర్లకు పరీక్ష. వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. 


జట్లు (అంచనా)

భారత్‌: మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, పుజార,  కోహ్లీ (కెప్టెన్‌), రహానె, విహారి, సాహా/పంత్‌ (వికెట్‌ కీపర్‌), అశ్విన్‌/జడేజా, ఇషాంత్‌/ఉమే్‌ష, షమి, బుమ్రా. 


న్యూజిలాండ్‌: లాథమ్‌, బ్లండెల్‌, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాస్‌ టేలర్‌, నికోల్స్‌, వాట్లింగ్‌ (వికెట్‌ కీపర్‌), గ్రాండ్‌హోమ్‌, డారిల్‌ మిచెల్‌/అజాజ్‌ పటేల్‌, సౌథీ, జేమీసన్‌, బౌల్ట్‌. 

Advertisement
Advertisement
Advertisement