రాగి పూత ఉన్న స్టీలు పాత్రలపై పడ్డ మరకలను ఉప్పు వేసిన నిమ్మరసంతో తోమితే సులభంగా పోతాయి.
యాపిల్ని రెండు ముక్కలుగా కోసి దానిపై నిమ్మరసం చుక్కలు వేస్తే యాపిల్ ముక్కల రంగు మారదు.
రసం పిండిన నిమ్మ చెక్కలతో కత్తులు, కత్తిపీటలు తుడిస్తే వాటికి అంటిన ఉల్లిపాయ వాసన పోతుంది.
దుస్తుల మీద పడిన కాఫీ, టీ మరకలు పోవాలంటే నిమ్మరసంలో రెండు స్పూన్ల ఉప్పు వేసి రుద్దితే మరకలు పోతాయి.
గంజిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో తెల్లబట్టలను ఉతికితే అవి మరింత తెల్లదనంతో మెరిసిపోతాయి.
కాఫీ పొడి సువాసన పోకుండా ఉండాలంటే దాన్ని మూత గట్టిగా ఉండే డబ్బాలో పోసి ఫ్రిజ్లో పెట్టాలి.
వెండిపాత్రల్లో కర్పూరం బిళ్లలు వేస్తే ఎంతకాలమైనా అవి నల్లబడవు.
పుస్తకాలు ఉంచే అల్మారాలో ఎండిన వేపాకులు వేసి పెడితే చెదపురుగులు పట్టవు.
ముత్యాల నగలు తెల్లదనం పోకుండా ఉండాలంటే వాటిని అప్పుడప్పుడు ఆలివ్ నూనెతో తుడవాలి.