Hyderabad : సీఎం కేసీఆర్(CM KCR)కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి(ESI Hospital) నిర్మాణానికి.. అవసరమైన 5 ఎకరాల భూమి కేటాయింపుపై లేఖలో ఆయన ప్రస్తావించారు. భూమి కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఆస్పత్రికి 5 ఎకరాల భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.