హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో అమలవుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనందువల్లే ఆలస్యం అవుతుందని కిషన్‌రెడ్డి లేఖలో ప్రస్తావించారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. టీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. 2014-15లో 250 కోట్లు ఉన్న బడ్జెట్.. 2021-22లో 2,420 కోట్లకు చేరిందని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.