Telangana భవిష్యత్ KCR కుటుంబం చేతిలో బంధీ: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-27T23:45:16+05:30 IST

తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Telangana భవిష్యత్ KCR కుటుంబం చేతిలో బంధీ: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌లో ఓటమి చింత పెరిగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి దళితుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్రపై కేసీఆర్ తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నిజాం ఘగర్ ఫ్యాక్టరీ, మూడెకరాలు, నిరుద్యోగభృతి, కేజీ టు పీజీ ఎందుకు అమలు కావడం లేదు? అని ప్రశ్నించారు.తెలంగాణకు కేంద్రం ఏమి చేయలేదో.. చెప్పాలని నిలదీశారు.టీఆర్ఎస్ పార్టీలో గుణాత్మమైన మార్పు రావాలన్నారు.


తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. సుప్రీంకోర్టులో కేసులతో వర్గీకరణ ఆలస్యం అవుతుందన్నారు. మసీదులు కూల్చుతామని బండి‌ సంజయ్ అనలేదన్నారు. 18 గంటలు కష్టించే ప్రధాని మోదీని విమర్శించే నైతికహక్కు టీఆర్ఎస్‌కు లేదని మండిపడ్డారు. కుటుంబ పార్టీల కారణంగా దేశంలో అవినీతి పెరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-05-27T23:45:16+05:30 IST