పిల్లల కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-08-11T06:07:12+05:30 IST

పిల్లల కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

పిల్లల కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

ఇద్దరు మహిళల అరెస్టు,  పరారీలో కిడ్నాపర్‌


పర్వతగిరి, ఆగస్టు 10: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌ గ్రామంలో ఇద్దరు చిన్నారులను అపహరించిన కేసును పోలీసులు ఛేదించారు. పిల్లలను రక్షిం చి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకో గా, అసలు కిడ్నాపర్‌ పరారీలో ఉన్నాడు. మామునూరు పోలీ్‌సస్టేషన్‌లో ఏసీపీ నరే్‌షకుమార్‌ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. అన్నారం గ్రామంలో ఈనెల 6న ఇద్దరు చిన్నారులు రెహాన్‌(6), కిజ్రాబేగం(2)లను వారి పక్క ఇంట్లో కిరాయికి ఉంటున్న హీరేఖాన్‌ అలియాస్‌ ఫిరోజ్‌ఖాన్‌ అనే వ్యక్తి ఆడిస్తానని తండ్రి యూసుఫ్‌ వద్ద నుంచి తీసుకెళ్లాడు. అదేరోజు చిన్నారులను అపహరించి అన్నారం నుం చి ఆర్టీసీ బస్సులో వరంగల్‌కు, అక్కడి నుంచి రైలులో మహారాష్ట్రలోని వార్ధా జిల్లా హింగం ఘాట్‌ గ్రామానికి వెళ్లాడు. తన అక్కాచెల్లెళ్లు అయిన ముంతాజ్‌ఖాన్‌ పఠాన్‌, సల్మాబేగంషేక్‌ ఫరీద్‌ షేక్‌ల వద్ద ఇద్దరు పిల్లలను దాచిపెట్టాడు. పిల్లల తండ్రి యూసుఫ్‌ 7వ తేదీన స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మామునూరు ఏసీపీ నరే్‌షకుమార్‌ ఆధ్వర్యంలో పర్వతగిరి సీఐ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి వరంగల్‌ బస్టాండ్‌, కాజీపేటలోని రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా, నిందితుడు పిల్లలతో మహారాష్ట్రకు వెళ్లినట్లుగా గుర్తించారు. నిందితుడు గతంలో అన్నారం గ్రామంలోని ఒక వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ నుంచి మహారాష్ట్రలోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడగా, ఫోన్‌ నంబర్‌ ఆధారంగా అడ్రస్‌ గుర్తించి అక్కడికి వెళ్లిన ఎస్సై దేవేందర్‌, కానిస్టేబుళ్లు రాజు, ప్రవీణ్‌, అరుణ, గౌతమిల బృందం ఇద్దరు చిన్నారులను కాపాడి నిందితుడి సోదరిలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, అసలు నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి పోలీసు బృందం గాలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఇద్దరు చిన్నారులకు తండ్రి యూసు్‌ఫకు అప్పగించారు. ఈ కేసును ఛేదించిన ఎస్సై దేవేందర్‌ బృందాన్ని ఈస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి అభినందించారు.

Updated Date - 2022-08-11T06:07:12+05:30 IST