ఖమ్మంలో టెలీ మెడిసిన్‌.. కేటీఆర్‌ ప్రశంసలు

ABN , First Publish Date - 2020-04-10T06:29:40+05:30 IST

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సహకారంతో ఖమ్మం జిల్లాలో టెలీ మెడిసిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉచితంగా వైద్యసేవలు...

ఖమ్మంలో టెలీ మెడిసిన్‌.. కేటీఆర్‌ ప్రశంసలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సహకారంతో ఖమ్మం జిల్లాలో టెలీ మెడిసిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు వైద్యులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ను మంత్రి కేటీఆర్‌  ట్విటర్‌ వేదికగా గురువారం ప్రశంసించారు. దీనిని అద్భుతమైన కార్యక్రమంగా ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-10T06:29:40+05:30 IST