పంతం నెగ్గించుకున్న కేశినేని

ABN , First Publish Date - 2021-02-25T22:57:55+05:30 IST

జయవాడ 39వ డివిజన్‌ అభ్యర్థిని ఎట్టకేలకు టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ డివిజన్‌ అభ్యర్థిపై ఎంపీ కేశినేని

పంతం నెగ్గించుకున్న కేశినేని

విజయవాడ: విజయవాడ 39వ డివిజన్‌ అభ్యర్థిని ఎట్టకేలకు టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ డివిజన్‌ అభ్యర్థిపై ఎంపీ కేశినేని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఈ పంచాయతి టీడీపీ అధినేత చంద్రబాబు దాకా వెళ్లింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మాజీమంత్రి అచ్చెనాయుడును  దూతగా పంపారు. ఈ సమస్యను అచ్చెన్నాయుడు సామరస్యంగా పరిష్కరించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విజయవాడ నగరంలో వివాదం నెలకొన్న 39వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థిగా శివశర్మ పేరును టీడీపీ ఖరారు చేసింది. ఇదే 39వ డివిజన్‌ నుంచి మాజీ కార్పొరేటర్‌ గుండారపు హరిబాబు కుమార్తె గుండారపు పూజిత కూడా టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.


ఈ నేపథ్యంలో ఎంపీ నాని, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి కార్పొరేటర్‌ టికెట్‌ ఇవ్వడమే కాకుండా, కార్యాలయ ప్రారంభోత్సవానికి రావడం వెంకన్న వర్గీయుల్లో ఆగ్రహానికి కారణమయింది. దీంతో ఎంపీ నానీని గుండారపు హరిబాబు, ఆయన కుమార్తె పూజిత తదితరులు అడ్డుకుని నిలదీశారు. బీసీలమైన తమకు అన్యాయం చేయడం ఎంత వరకు సబబమని ప్రశ్నించారు. పార్టీనే నమ్ముకుని ఎంతో కాలంగా పనిచేస్తున్నామని, తమకు అన్యాయం చేయవద్దని కోరారు. నిరసనల నడుమే నాని ప్రారంభోత్సవాన్ని ముగించుకుని వెనుదిరిగారు. అప్పట్నుంచి 39వ డివిజన్ అభ్యర్థిత్వంపై టీడీపీ వివాదం నెలకొంది. శివశర్మ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసిందని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు  అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ తర్వాత బుద్దా వెంకన్న, నాగుల్ మీరాను చంద్రబాబుతో అచ్చెన్నాయుడు మాట్లాడించారు. 

Updated Date - 2021-02-25T22:57:55+05:30 IST