Abn logo
Aug 9 2021 @ 18:47PM

కేశవరావు మృతి న్యాయవ్యవస్థకు తీరనిలోటు: ఎన్వీ రమణ

ఢిల్లీ: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు మృతిపట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. కేశవరావు 35 ఏళ్ల న్యాయ జీవితంలో వివిధ హోదాల్లో పనిచేశారని గుర్తుచేశారు. కేశవరావు మృతి న్యాయవ్యవస్థకు తీరనిలోటని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కేశవరావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు, పేదలకు అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు సీఎం  కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు గుండె పోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటు రావడంతో మృతి చెందారని డాక్టర్లు తెలిపారు.