ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచీ ఇండియాకు తిరిగి వచ్చిన కేరళ యువతి... చెప్పినట్టుగానే తనతోపాటు దాన్ని కూడా తెచ్చుకుంది!

ABN , First Publish Date - 2022-03-04T01:24:57+05:30 IST

ఆ యువతికి 20ఏళ్లే. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా.. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయినా ఆ యువతి మాత్రం వెనక్కి తగ్గలే

ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచీ ఇండియాకు తిరిగి వచ్చిన కేరళ యువతి... చెప్పినట్టుగానే తనతోపాటు దాన్ని కూడా తెచ్చుకుంది!

ఎన్నారై డెస్క్: ఆ యువతికి 20ఏళ్లే. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా.. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయినా ఆ యువతి మాత్రం వెనక్కి తగ్గలేదు. భారీ సాహసానికి ఒడికట్టి.. అనుకున్నది సాధించి మరీ.. స్వదేశంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మెడిసిన్ చదివేందుకు ఏటా వందలాది మంది భారతీయులు ఉక్రెయిన్ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కేరళకు చెందిన ఆర్య ఆల్డ్రిన్ కూడా ఉక్రెయిన్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతుండగానే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే ఇండియాకు వచ్చేందకు ఆర్య ఆల్డ్రిన్‌కి కొద్ది రోజుల క్రితం అవకాశం లభించింది. కానీ అపుడు ఆమె స్వదేశానికి రావడానికి ఇష్టపడలేదు. కారణం.. ఆమె పెంపుడు కుక్క. ఆర్య ఆల్డ్రిన్ కొన్ని నెలలుగా సైబీరియన్ హస్కీ జాతికి చెందిన శునకాన్ని పెంచుకుంటోంది. ఉక్రెయిన్‌లో నెలకొన్ని భయానక పరిస్థితుల్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకాన్ని అక్కడ వదిలేసి రాలేక పోయింది. స్వదేశానికి తిరిగి వస్తే తన పెంపుడు కుక్కతోనే వస్తానని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో సుమారు 20 కిలోమీటర్లమేర నడిచి.. పొరుగు దేశానికి చేరుకుంది. 



ఆ తర్వాత ఆర్య ఆల్డ్రిన్ తన పెంపుడు కుక్కతో బస్‌లో ప్రయాణించిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మూగజీవంపై పెంచుకున్న ఆమె ప్రేమను చూసి పలువురు నెటిజన్లతోపాటు కేరళ మంత్రి కూడా ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఆమెపై ప్రశంసలు కురిపించారు. కాగా.. ఎట్టకేలకు రొమేనియా నుంచి ఇండియాకు తన పెంపుడు కుక్కతోపాటు బుధవారం రాత్రి బయల్దేరిన ఆర్య ఆల్డ్రిన్.. కొద్ది గంటల ముందు ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెంపుడు కుక్కను తీసుకురావడం కోసం రెండు రోజులపాటు వేచి ఉండి అనుమతులు తీసుకున్నట్టు పేర్కొంది. అంతేకాకుండా ఉక్రెయిన్ నుంచి కాలి నడకన పెంపుడు శునకంతో సహా పొరుగు దేశానికి వెళ్లే సమయంలో ఎంతో మంది తనను ఎగతాళి చేసినట్టు వెల్లడించింది. అయితే తాను మాత్రం అవేవి పట్టించుకోలేదని తెలిపింది.




Updated Date - 2022-03-04T01:24:57+05:30 IST