కెల్టెన్ టెక్ సొల్యూషన్స్... 52 వారాల గరిష్టానికి...

ABN , First Publish Date - 2022-01-18T20:20:53+05:30 IST

కెల్టెన్ టెక్ సొల్యూషన్స్ షేర్లు మంగళవారం దూసుకెళ్ళాయి. ఇంట్రా-డేలో కెల్టన్ టెక్ సొల్యూషన్స్ షేర్లు పది శాతం, అప్పర్ సర్క్యూట్‌లో 52 వారాల గరిష్టం రూ. 113.30 వద్ద లాక్ అయ్యాయి.

కెల్టెన్ టెక్ సొల్యూషన్స్... 52 వారాల గరిష్టానికి...

ముంబై : కెల్టెన్ టెక్ సొల్యూషన్స్ షేర్లు మంగళవారం దూసుకెళ్ళాయి. ఇంట్రా-డేలో కెల్టన్ టెక్ సొల్యూషన్స్ షేర్లు పది శాతం, అప్పర్ సర్క్యూట్‌లో 52 వారాల గరిష్టం రూ. 113.30 వద్ద లాక్ అయ్యాయి. మధ్యాహ్నం 01:19 గంటల వరకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో కెల్టన్ టెక్ సొల్యూషన్స్ యొక్క మొత్తం ఈక్విటీలో 10.73 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 10.36 మిలియన్ ఈక్విటీ షేర్లు చేతులు మారడంతో కౌంటర్‌లో ట్రేడింగ్ వాల్యూమ్‌లు దాదాపు రెట్టింపయ్యాయి. రెండు ఎక్స్ఛేంజీలలో 2.80 లక్షల షేర్ల కొనుగోలు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని డేటా వెల్లడించింది. గత నాలుగు వారాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల కంపెనీ స్టాక్... మొన్నటి డిసెంబరు 21 న రూ. 55.30 స్థాయి నుంచి 104 శాతం జూమ్ చేసింది. ఇదే సమయంలో ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ 8.9 శాతం పెరిగింది. ఈ స్టాక్ మార్చి 8, 2016 న రికార్డు స్థాయిలో రూ. 118 కు చేరింది. కెల్టన్ టెక్ అన్నది 'బోర్న్ డిజిటల్' టెక్నాలజీ కన్సల్టింగ్ సేవల సంస్థ. ఇది యూఎస్, యూరప్, భారతదేశం, ఆసియా-పసిఫిక్ అంతటా కార్యకలాపాలతో 'టెక్నాలజీతో అనంతమైన అవకాశాలు' అనే నినాదంతో ఏర్పాటైంది. 

Updated Date - 2022-01-18T20:20:53+05:30 IST