కీసర టోల్‌గేట్‌ వద్ద బారులు తీరిన వాహనాలు

ABN , First Publish Date - 2022-01-09T01:11:05+05:30 IST

జాతీయ రహదారిపై శనివారం వాహనాల రద్దీ ఏర్పడింది. ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ బండెనక బండన్నట్టుగా కార్లు రావటంతో

కీసర టోల్‌గేట్‌ వద్ద బారులు తీరిన వాహనాలు

కంచికచర్ల: జాతీయ రహదారిపై శనివారం వాహనాల రద్దీ ఏర్పడింది. ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ బండెనక బండన్నట్టుగా కార్లు రావటంతో టోల్‌గేట్ల వద్ద బారులు తీరాయి.  తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాదు పట్టణంలో నివాసముంటున్న కోస్తాంధ్రకు చెందిన వారు సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వస్తున్నారు. ఎక్కువ మంది సొంత వాహనాలతో బయలుదేరటంతో జాతీయ రహదారిపై అనూహ్యంగా వాహనాల రద్దీ పెరిగింది. కార్లు, ఇతర వాహనాలతో రహదారి కిటకిటలాడుతోంది. చిల్లకల్లు, కీసర టోల్‌గేట్ల వద్ద ఏలాంటి ఇబ్బందులు లేకుండ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ  కార్లు చీమల బారులా వస్తుండటంతో కీసర టోల్‌గేట్‌ వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. వాహనాల రద్దీ రెండు రోజులు ఉంటుందని టోల్‌గేట్ సిబ్బంది చెబుతోంది.

Updated Date - 2022-01-09T01:11:05+05:30 IST