రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-01-01T00:38:43+05:30 IST

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాదిలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాదిలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. ఏటేటా వినూత్న పంథాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2022 ఏడాదిలో కూడా కష్టాలను అధిగమిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని కేసీఆర్‌ పేర్కొన్నారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధించారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 


Updated Date - 2022-01-01T00:38:43+05:30 IST