ఈ నెల 4న సిరిసిల్లలో కేసీఆర్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-07-02T12:09:27+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 4న రాజన్న సిరిసిల్లకు రానున్నారు. దీంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సీఎం పర్యటనపై

ఈ నెల 4న సిరిసిల్లలో కేసీఆర్‌ పర్యటన

రాజన్న సిరిసిల్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 4న రాజన్న సిరిసిల్లకు రానున్నారు. దీంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సీఎం పర్యటనపై అధికారికంగా షెడ్యూలు విడుదల కావాల్సి ఉంది. సిరిసిల్లలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయంతోపాటు ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిని ప్రారంభిస్తారు. పల్లె ప్రగతి పనులను కూడా సీఎం తనిఖీ చేసే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్‌ తన అత్తగారి ఊరైనా బోయినపల్లి మండలం కొదురుపాకలో పల్లె నిద్ర చేస్తారని తెలుస్తోంది. 

Updated Date - 2021-07-02T12:09:27+05:30 IST