సీఎం కాకముందు కేసీఆర్‌ పాస్‌పోర్టుల బ్రోకర్‌!

ABN , First Publish Date - 2022-04-23T07:05:17+05:30 IST

‘కేసీఆర్‌ సీఎం కాకముందు పాస్‌పోర్టుల బ్రోకర్‌గా

సీఎం కాకముందు   కేసీఆర్‌ పాస్‌పోర్టుల బ్రోకర్‌!

  •  అప్పటి కమీషన్‌ అలవాటు ఇంకా కొనసాగుతోంది
  •   వరి వేయని రైతులకు పరిహారం చెల్లించాలి
  •  కౌలు రైతులకు బంధు పథకం వర్తింజేయాలి
  •  ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ 


గద్వాల/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘కేసీఆర్‌ సీఎం కాకముందు పాస్‌పోర్టుల బ్రోకర్‌గా పనిచేశారు. అప్పటి కమీషన్ల అలవాటు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర తొమ్మిదో రోజు గద్వాల మండలంలోని శెట్టి ఆత్మకూరు నుంచి ప్రారంభమై.. ఈడిగోనిపల్లి, పెద్దపాడు, చింతరేవుల, భీంపూర్‌ మీదుగా నందిమల్ల వరకు సాగింది.


ఈ సందర్భంగా పెద్దపాడులో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో బండి సంజయ్‌ ప్రసంగించారు. కేసీఆర్‌కు కమీషన్లు దొబ్బుడు అలవాటు ఉంది కాబట్టే పెట్రోల్‌ మీద రూ.33 కమీషన్‌ తీసుకుంటున్నారని, పక్క రాష్ట్రమైన కర్ణాటకలో పెట్రోల్‌ రూ.13 తక్కువగా ఉందని బండి చెప్పారు. కేసీఆర్‌ వరి వేస్తే ఉరి అనడం వల్ల రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయలేదని, వరి కొనుగోలు చేయబోమని ప్రభుత్వం చెప్పడంతో వారు నష్టపోయారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రారంభించినందున, కేసీఆర్‌ అనాలోచిత ని ర్ణయం వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని డి మాండ్‌ చేశారు.


సీఎం కేసీఆర్‌ ఓ సారి వరి వేయొద్దని, మరోసారి కొనుగోలు చేయనని చెప్పడం, ఇండెంట్‌ ఇవ్వకుండా.. ధాన్యం ఇవ్వనని చెప్ప డం.. తర్వాత ధర్నాలు చేయడం, రైతుల మద్దతు లేకపోవడంతో తానే కొనుగోలు చేస్తామని ప్రకటించడం అంతా ఒక డ్రామాలాగా సాగించారని అన్నారు. ఒకప్పుడు వరికి రూ.1310 మద్దతు ధర ఉండేదని, ఇప్పు డు అది రూ.1960 వరకు చేరిందని, రానున్న రోజుల్లో కేంద్రం మరింత మద్దతు పెంచుతుందన్నారు. కానీ రాష్ట్రంలో ఒక్కో క్వింటాల్‌పై తవుడు అని, తాలు అని, తేమ అని, మట్టి అని అయిదు కిలోల కంటే ఎక్కువగానే రైతుల నుంచి తీసుకుని మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతు లు బాగుపడటం కేసీఆర్‌కు ఇష్టం లేదని, తన కుటుంబం ఒక్కటి బాగుపడితే చాలని, ఒక్కరికే రాజ్యం ఇవ్వడం వల్ల పది తరాలు బతికేంతగా సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.


ప్రస్తుతం ‘పెట్టెటోడు మనోడై నా.. వడ్డేంచేటోడు మనోడు’ కాదన్నట్లు పరిస్థితి ఉందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే పెట్టెటోడు, వడ్డించేటోడు అందరూ ఒకటే అవుతారని చెప్పారు. కౌలు రౌతులకు కాకుండా వంద ఎకరాలున్న భూస్వాములు హైదరాబాద్‌లో ఉన్నా రైతుబంధు అందుతోందని చెప్పా రు. రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ చేస్తానని చెబితే రైతులంతా సంతోషించారని, కానీ ఇప్పటివరకు చేయకపోవడంతో బ్యాంకులు కొత్త రుణా లు ఇవ్వక.. జేబుల నుంచి కట్టుకోనివ్వక.. ఇప్పుడు మిత్తికి మిత్తి పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లలో పంట నష్టపరిహారం కింద ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. పొలం కాడ 24 గంటల ఉచిత కరెంటు అంటున్నారని, కానీ 24 గంటలు రాకపోగా.. గృహ విద్యుత్తు చార్జీలను పెంచుతున్నారని ఆరోపించారు. మోదీ ఇచ్చిన ఇళ్లను కేసీఆర్‌ నిర్మించి ఇవ్వడం లేదని తెలిపారు.


తొలి విడత ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా తాము ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీ ఇచ్చామని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. పాదయాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పాదయాత్ర ప్రముఖ్‌ మనోహర్‌రెడ్డి  పాల్గొన్నారు. 




కేంద్ర నిధులపై కేటీఆర్‌కు బీజేపీ సవాల్‌

గడచిన ఏడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై ధైర్యముం టే బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ నేతలకు బీ జేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ సవాల్‌ చేశారు. ‘ఏ డేళ్లలో కేంద్రం రూ.3.18 లక్షల కోట్లు ఇచ్చింది.. రాష్ట్రం తీసుకుంది.. ఏ పథకానికి, ఏ అభివృద్ధి పనికి ఎంత ఇచ్చిందో లెక్కలన్నీ చెబు తం.. మీరు కూడా రాష్ట్ర ప్రజల నుంచి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయమెంత? జిల్లాలవారీగా చేసిన ఖర్చు ఎంత? అన్న లెక్కలు చర్చ సందర్భంగా తీసుకురావాలి’ అని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాణి రుద్రమ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రూ.1,68,647 కోట్ల కంటే ఒక్క రూపాయి ఎ క్కువ కేంద్రం ఇచ్చినా తన పదవికి రాజీనామా చేస్తానన్న సవాలును స్వీకరిస్తున్నామని ప్రకటించారు. ‘మీరు చెప్పినట్లు కేంద్రం ఇచ్చిన నిధులు రూ.1,68,647 కోట్లు కాదు.. రూ.3.18 లక్షల కోట్లు’ అని స్పష్టం చేశారు. 


Updated Date - 2022-04-23T07:05:17+05:30 IST