విశాఖలో కేసీఆర్‌ ఫ్లెక్సీలు

ABN , First Publish Date - 2022-02-18T02:13:37+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తులు విశాఖలోని ముఖ్యకూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.

విశాఖలో కేసీఆర్‌ ఫ్లెక్సీలు

విశాఖపట్నం: తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తులు విశాఖలోని ముఖ్యకూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ‘దేశానికి అవసరమైన జనహృదయనేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ మద్దిలపాలెం, సత్యం జంక్షన్‌, గురుద్వార, స్పెన్సర్స్‌, సిరిపురం జంక్షన్లలో గురువారం ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఎవరు ఏర్పాటుచేశారనేది మాత్రం ఫ్లెక్సీలో ఎక్కడా కనిపించకపోవడం విశేషం. కాగా కేసీఆర్‌ త్వరలో జాతీయ పార్టీని ఏర్పాటుచేయబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లోని పెద్దలు ఎవరితోనైనా వీటిని ఏర్పాటుచేయించారా? లేక నగరంలో కేసీఆర్‌తో సంబంధాలు కలిగిన ఆయన సామాజిక వర్గానికి చెందినవారెవరైనా ఏర్పాటుచేశారా?...అనేది చర్చనీయాంశమైంది. 

Updated Date - 2022-02-18T02:13:37+05:30 IST