కేసీఆర్ దత్తత గ్రామంలో గందరగోళం

ABN , First Publish Date - 2021-08-04T19:11:48+05:30 IST

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామంలో గందరగోళం నెలకొంది. సీఎం సమావేశానికి దళితులను మాత్రమే అనుమతించడంపై

కేసీఆర్ దత్తత గ్రామంలో గందరగోళం

యాదాద్రి: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామంలో గందరగోళం నెలకొంది. సీఎం సమావేశానికి దళితులను మాత్రమే అనుమతించడంపై గ్రామస్తుల అభ్యంతరం తెలిపారు. మొదట దళితులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు గ్రామంలోని 150 మందికి అనుమతి ఉందని చెప్పిన అధికారులు సీఎం సమావేశానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులు వాపోయారు. సీఎం పర్యటనలో ప్రధానంగా వాసాలమర్రిలోని దళితవాడలను పరిశీలన, గ్రామంలోని రైతువేదిక భవనంలో ప్రజలతో సమావేశం నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఆతర్వాత సర్పంచ్ ఇంట్లో భోజనం చేసిన అనంతరం హైదరాబాద్‌కు కేసీఆర్ తిరుగుప్రయాణమవుతారు. సీఎందత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ ఏడాది జూన్‌ 22న సీఎం పర్యటించారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేశారు. ‘ఇంకా 20సార్లు వస్తా.. ఊరు మధ్యలో కూర్చుని మాట్లాడుకుందాం’ అని ఆ రోజు చెప్పారు. జూలై 10న రావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో పర్యటన వాయిదా పడింది.

Updated Date - 2021-08-04T19:11:48+05:30 IST