ఈ నెల 3న 'స్వాతంత్ర్య స్పూర్తి రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం

ABN , First Publish Date - 2021-04-01T22:23:15+05:30 IST

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత ప్రభుత్వం "ఆజాదీ కా అమృత మహోత్సవ్" పేరిట కార్యక్రమాలు రూపొందించాలని సూచించిన విషయం తెలిసిందే.

ఈ నెల 3న 'స్వాతంత్ర్య స్పూర్తి రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం

హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత ప్రభుత్వం "ఆజాదీ కా అమృత మహోత్సవ్" పేరిట కార్యక్రమాలు  రూపొందించాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం మేరకు మార్చి 12వ తేదీ నుండి 75 వారాల పాటు వివిధ రకాల కార్యక్రమాలను "స్వతంత్ర భారత అమృతోత్సవాలు" పేరిట తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది.


ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 3వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి రవీంద్ర భారతి హైదరాబాద్ లో 75మంది  కవులతో 'స్వాతంత్ర్య స్పూర్తి" అనే అంశంపై రాష్ట్రస్థాయి కవి సమ్మేళనాన్ని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారధ్యంలో పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నదని ఉత్సవాల కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారులు డా. కెవి రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని . రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ కవి సమ్మేళనాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు ఆయన సూచించారు.


Updated Date - 2021-04-01T22:23:15+05:30 IST